హాట్ కేకుల్లా అమ్ముడైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు

- October 04, 2021 , by Maagulf
హాట్ కేకుల్లా అమ్ముడైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు

యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో మ్యాచ్ జరిగితే టికెట్లు దొరకటమే కష్టం. కానీ తటస్థ వేదికపై ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ లకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24 న ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టికెట్లను ఇలా అమ్మటం స్టార్ట్ చేశారో లేదో రెండు రోజుల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం వేలాది మంది అభిమానులు వెబ్ సైట్ కు పోటెత్తారు. ప్రీమియం, ప్లాటినం టిక్కెట్లు కూడా సేల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి మ్యాచ్ లకు 70 శాతం మంది అభిమానులను మాత్రమే అనుమతిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com