కొత్త ట్రావెల్ పాలసీకి అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలు

- October 05, 2021 , by Maagulf
కొత్త ట్రావెల్ పాలసీకి అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలు

ఖతార్: ఖతార్ ప్రభుత్వం కొత్త ట్రావెల్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వీరికి రెండు రోజుల హోటల్ క్వారంటైన్ ఉంటుంది. గ్రీన్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ తీసుకోకపోయిన అనుమతి ఉంది. కానీ 7 డేస్ హోటల్ క్వారంటైన్ లో ఉండాలి. ఐతే అందుకు అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలను ప్రకటించాయి. వీటిని ఖతార్ వచ్చే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిస్కవర్ ఖతార్ వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు హోటల్స్ ను బుక్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్వారంటైన్ కు, ఏడు రోజుల క్వారంటైన్ కు ఆఫర్స్ తో చాలా హోటల్స్ ప్యాకేజీలు ప్రకటించాయి. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే 11 ఏళ్ల లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకపోయిన సరే వాళ్లకు అనుమతి ఇచ్చారు. ఐతే  రెండు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com