అమర్‌నాథ్ యాత్ర జూలై రెండో తేదీ నుంచి మొదలు...
- March 17, 2016
ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్రకు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూలై రెండో తేదీ నుంచి మొదలు కాబోతున్న ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు.. ప్రత్యేకంగా ఎంపికచేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్, యస్ బ్యాంక్ శాఖల్లో వివరాలు నమోదుచేసుకునే వీలుంది. మొదట దరఖాస్తుచేస్తున్న వారికి మొదట అనుమతించే విధానంలో అనుమతులు జారీ చేయనున్నారు. ఒక అనుమతి ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఈ బ్యాంకు శాఖల్లో నిర్దేశించిన రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 75 ఏళ్లు పైబడినవారు, ఆరు కంటే ఎక్కువ వారాలు పూర్తైన గర్భిణులను యాత్రకు అనుమతించరు.ప్రతి యాత్రికుడూ దరఖాస్తుతోపాటు ఆరోగ్య ధ్రువపత్రం(సీహెచ్‌సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు చూడాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







