పాకిస్థాన్‌లో భూకంపం..20 మంది మృతి
- October 07, 2021
పాకిస్థాన్: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే. అందుకే ఆ పర్యావరణానికి కోపమొచ్చి మనుషులపైకి సునామీలు, భూకంపంలా రూపంలో దూసుకొస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో కూడా అదే జరిగింది. గురువారం తెల్లవారుజామున దక్షిణ పాకిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలను కోల్పోయారు. తెల్లవారుజామున కాబట్టి ప్రజలు ఈ భూకంపాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. మరణించిన వారిలో చాలామంది ఇళ్ల గోడలు కూలి మరణించినవారే. చనిపోయినవారిలో ఒక మహిళ, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం ధాటికి 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!
- సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు







