కరోనా తగ్గుముఖం పట్టడంతో... టూరిజం పై దృష్టిపెట్టిన భారత్..

- October 07, 2021 , by Maagulf
కరోనా తగ్గుముఖం పట్టడంతో... టూరిజం పై దృష్టిపెట్టిన భారత్..

న్యూ ఢిల్లీ: కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో...భారత కేంద్ర ప్రభుత్వం  ఇంటర్నేషనల్ ప్రయాణికులపై అమల్లో ఉన్న ఆంక్షలను సడలిస్తోంది. నవంబర్ 15 నుంచి విదేశీయులకు ... టూరీజం వీసాలను సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేయనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి చార్టర్డ్ విమానాల ద్వారా భారత్‌ వచ్చే విదేశీయులకు... తాజా టూరిస్ట్ వీసాలను మంజూరు చేయడం ప్రారంభిస్తారు. అయితే, చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కాకుండా ఇతర విమానాల ద్వారా ప్రయాణించే విదేశీ పర్యాటకులకు నవంబర్ 15 నుంచి వీసాలు ఇవ్వనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నోటిఫై చేసిన కరోనా మార్గదర్శకాలు...నిబంధనలను విదేశీ పర్యాటకులు, భారతదేశంలోకి తీసుకువచ్చే క్యారియర్లు, ల్యాండింగ్ స్టేషన్లలో ఇతర వాటాదారులు... తప్పనిసరిగా పాటించాలని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ...విదేశీ పర్యాటకులకు మంజూరు చేసిన అన్ని వీసాలను కేంద్ర హోం శాఖ గత ఏడాది నిలిపివేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఇతర ఆంక్షలు కూడా విధించింది. కోవిడ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు, ఉండేందుకు టూరిస్ట్ వీసా కాకుండా ఇతర భారతీయ వీసాలను పొందేందుకు అనుమతించారు.మరో వైపు విదేశీ పర్యాటకులను అనుమతించడానికి...రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, పర్యాటక రంగంలోని వివిధ సంస్థల నుంచి సలహాలను తీసుకున్నారు. అలాగే, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖలను సంప్రదించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com