ఖైదీల్లో పరివర్తనను కృషి చేస్తున్నాం...విద్యా, ఉపాధి శిక్షణ ఇస్తున్నాం
- October 08, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ జైళ్లలో ఉన్న ఖైదీల్లో పరివర్తన కు కృషి చేస్తున్నామని డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ షేక్ ఖలీఫా బిన్ అల్ ఖలీఫా తెలిపారు. గురువారం పలు జైళ్లను ఆయన సందర్శించారు.అక్కడ ఖైదీలను కలిసి వారికి ఎలాంటి సదుపాయాలున్నాయో తెలుసుకున్నారు. అనంతరం జైళ్ల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఖైదీల్లో పరివర్తనకు, వారి పునరావాస చర్యలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.ఖైదీలకు హాండీక్రాప్ట్ సహా పలు రంగాల్లో ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు అధికారులకు తెలిపారు. చదువుకునే వారికి విద్యా సాయం అందించాలని, వైద్య సదుపాయాల విషయంలో రాజీ పడవద్దని మీటింగ్ లో చెప్పారు. ఖైదీలు పనిచేసే చోటును పరిశీలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నామని చెప్పారు. జైలు అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







