స్వచ్ఛంద సంస్థలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- October 08, 2021
ఒమన్: ఒమన్ ను షాహీన్ తుపాన్ గజగజ వణికించింది. దీని ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చాలా ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఐతే వీరందరికి పునరావాస చర్యలు చేపట్టింది ఒమన్ ప్రభుత్వం. ఐతే బాధితులకు సేవ చేసేందుకు ముందు వస్తున్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వచ్చంద సంస్థలను ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ లో చేసుకోవాలని కోరింది. http://oco.org.om/volunteer/వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ లో చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్వచ్ఛంద సంస్థలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి సేవలను ఎక్కడెక్కడ వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుందని అదే విధంగా బాధితులకు కూడా వేగంగా రిలీఫ్ అందించవచ్చని ప్రకటించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







