T1 నుంచి ఫ్లయిట్ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు సిద్ధమైన ఢిల్లీ విమానాశ్రయం

- October 08, 2021 , by Maagulf
T1 నుంచి ఫ్లయిట్ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు సిద్ధమైన ఢిల్లీ విమానాశ్రయం

న్యూఢిల్లీ: GMR గ్రూప్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), టెర్మినల్-1 కార్యకలాపాలు అక్టోబర్ 31, 00.01 గంటల నుండి పున: ప్రారంభమవుతాయని నేడు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రయాణీకులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిద్ధంగా ఉంది.

దాదాపు 18 నెలల మూసివేత అనంతరం, కోవిడ్‌కు ముందున్న ఆపరేటర్లైన ఇండిగో, స్పైస్‌జెట్‌తో టెర్మినల్-1 కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి, పున:ప్రారంభం తర్వాత T1 నుండి షెడ్యూల్ చేసిన మొదటి విమానం ఇండిగో విమానం. ఇది ముంబైకి 01.05 గంటలకు బయలుదేరుతుంది.

భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా, COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి DIAL అనేక భద్రతా చర్యలు తీసుకుంది.

"దాదాపు 18 నెలల మూసివేత అనంతరం T1 వద్ద దేశీయ విమాన కార్యకలాపాల పున:ప్రారంభం కోసం ఢిల్లీ విమానాశ్రయం సిద్ధంగా ఉంది. ఈ టెర్మినల్ పున:ప్రారంభంతో, ఢిల్లీ విమానాశ్రయం పూర్తిగా పనిచేస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ప్రయాణీకులకు భరోసా ఇస్తున్నాము. ప్రయాణీకుల సౌకర్యం విషయంలో రాజీ పడకుండా విమానాశ్రయంలో మేం అనేక చర్యలను అమలు చేసాము. విమానాశ్రయంలో సామాజిక దూరాన్ని పాటించేలా ప్రయాణీకులకు ప్రోత్సహించడం ద్వారా DIAL కోవిడ్ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది” అని ఢిల్లీ విమానాశ్రయ సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ అన్నారు.

COVID-19 విమానయాన పరిశ్రమనంతా ప్రభావితం చేసింది, విమానాశ్రయాలు కూడా దీనికి మినహాయింపు కాలేదు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశీయ, అంతర్జాతీయ విమానాల వాణిజ్య కార్యకలాపాలు మార్చి 24, 2020 నుంచి నిలిపివేయబడ్డాయి.

టెర్మినల్-3, టెర్మినల్-2లను పున:ప్రారంభించిన అనంతరం టీ-1ను అభివృద్ధి చేసారు. వరుసగా మే 25, 2020, జూలై 22, 2021 నుంచి ఇక్కడ టెర్మినల్-3, టెర్మినల్-2 కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి టెర్మినల్ 1 వద్ద ఏర్పాట్లు

  • టెర్మినల్‌లోకి ప్రవేశించే ముందు డిపార్చర్ ఫోర్‌కోర్ట్‌లో వెబ్ చెకిన్ కోసం ప్రయాణీకులకు 6 CUSS కియోస్క్‌లు అందుబాటులో ఉన్నాయి
  • ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణీకుల థర్మల్ స్కానింగ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి

చెకిన్ వద్ద

  • కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించడానికి, సెక్యూరిటీ మరియు ఫ్రిస్కింగ్ ఎంట్రీ పాయింట్ల  ప్రవేశం కోసం ప్రయాణీకులు ఇ-బోర్డింగ్ స్కానర్‌లను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు

సెక్యూరిటీ చెక్ వద్ద

  • క్యూ మేనేజర్ల విస్తరణ, ఫ్లోర్ మార్కింగ్‌లు మరియు ప్రత్యామ్నాయ సీట్ల కేటాయింపు, వివిధ ప్రదేశాలలో ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ల ఏర్పాటు
  • ప్రయాణీకుల భద్రత కోసం క్రమపద్ధతిలో ట్రే డిసెన్‌ఫిక్షన్
  • భద్రతా తనిఖీల తర్వాత ప్రయాణీకుల కోసం ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్ యంత్రాలు
  • కాంటాక్ట్-లెస్ రిటైల్ మరియు F&B ఎంపికలు, భద్రతా తనిఖీల తర్వాత, ప్రయాణీకులు SHA వద్ద ఫుడ్ కార్ట్‌లు, రిటైల్ షాపులలో షాపింగ్ చేయవచ్చు. ఫుడ్ అండ్ బెవరేజ్ (F&B) షాపులు, రిటైల్ షాపులలో కఠినమైన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు. షాపులు, లిఫ్ట్‌లు, సీట్లు మొదలైన వాటిలో సామాజిక దూరపు గుర్తుల ఏర్పాటు 

బోర్డింగ్ గేటు వద్ద

  • ప్రయాణికుల మధ్య సామాజిక దూరం కోసం క్రాస్ మార్కులతో ‘సీట్లను ఉపయోగించవద్దు’ అనే విజ్ఞన్తి 
  • బోర్డింగ్ & బస్సింగ్ గేట్ల వద్ద మోహరించిన క్యూ మేనేజర్ల ద్వారా ప్రయాణికుల నిరంతర పర్యవేక్షణ
  • ప్రయాణీకుల భద్రత కోసం వారు మాస్క్‌లు ధరించాలని, అన్ని సమయాలలో సామాజిక దూరాన్ని పాటించాలని DIAL కోరుతోంది

ఎక్కువగా తాకే ప్రదేశాల శానిటైజేషన్

  • విస్తారమైన టెర్మినల్-1ను 24 గంటలూ ‘డీప్ క్లీనింగ్’ చేస్తున్నారు. టెర్మినల్ పరిశుభ్రంగా ఉండేలా తగినంత హౌస్ కీపింగ్ సిబ్బంది. సిబ్బంది విధులకు వెళ్లే ముందు వారికి థర్మల్‌ పరీక్షలు
  • టెర్మినల్స్ లోపల డెస్క్‌లు, కుర్చీలు, ఎలివేటర్లు, రెయిలింగ్‌లు, CUSS, ట్రాలీలు, హ్యాండిల్స్, ట్రేలు, బ్యాగేజ్ బెల్ట్‌లు వంటి హై కాంటాక్ట్ ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం జరుగుతుంది. ఇవి కాకుండా, గంటగంటకూ వాష్‌రూమ్‌లను మూసివేసి, వాటి ఉపరితలాలన్నింటినీ శుభ్రపరుస్తారు.
  • ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విమానాశ్రయంలో అనుమానిత COVID-19 ప్రయాణీకులను వేరుచేయడానికి కూడా DIAL ఏర్పాట్లు చేసింది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com