అల్-సఫ్రియా మసీదు లో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రార్థనలు
- October 09, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుక్రవారం అల్ సఫ్రియా ప్యాలెస్ లో ప్రార్ధనలు చేశారు. ఆయనతో పాటు రాజు కుమారుడు, సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మహ్మద్ అల్-హెజేరి మసీదు లో ప్రార్థనలు చేశారు. అనంతరం అల్ -హెజెరీ మాట్లాడారు. రాజు హమిద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్ ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నారని అన్నారు. బహ్రెయిన్ రాజ్యంపై అల్లా చూపుతున్న దయకు కృతజ్ఞులమని ఆయన అన్నారు. కరోనా మహమ్మరి ప్రభావం పూర్తిగా తగ్గి మసీదులో ఎప్పటిలాగే సాధారణ ప్రార్థనలు జరగాలని ఆకాంక్షించారు. అదే విధంగా రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కు ఎప్పుడూ అల్లా ఆశీర్వదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







