తైవాన్ తమ ప్రావిన్సు: చైనా అధ్యక్షుడు

- October 09, 2021 , by Maagulf
తైవాన్ తమ ప్రావిన్సు: చైనా అధ్యక్షుడు

బీజింగ్‌: తైవాన్‌ ఏకీకరణను శాంతియుతంగా చేపట్టనున్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్‌ను తమ దేశంలో కలుపుకోవాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాల్సిందే అని ఆయన అన్నారు. తైవాన్ ఏకీకరణను శాంతియుతంగానే సాధించాలని, వేర్పాటువాదాన్ని వ్యతిరేకించే వైభవ సాంప్రదాయం చైనా ప్రజలకు ఉన్నట్లు ఆయన పరోక్ష వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. కానీ తైవాన్ తమ ప్రావిన్సు అని చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక ఏకీకరణ కోసం తైవాన్‌పై దళాలను కూడా వినియోగించేందుకు వెనుకాడేదిలేదని ఇటీవల చైనా స్పష్టం చేసింది. సుమారు 150 చైనా యుద్ధ విమానాలు ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2025 నాటికి తమ దేశాన్ని చైనా ఆక్రమించేస్తుందని తైవాన్ అభిప్రాయపడింది.

1911లో జరిగిన ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. మాతృభూమిని ఏకీకరించాలన్న చరిత్రాత్మక లక్ష్యాన్ని చేరుకోవాలని, కచ్చితంగా ఆ టార్గెట్‌ను సాధిస్తామని ఆయన అన్నారు. ఒక దేశం- రెండు వ్యవస్థల విధానం ప్రకారం ఏకీకరణ ప్రశాంతంగా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తైవాన్ వ్యక్తిగత వేర్పాటువాదం వల్ల మాతృభూమి ఏకీకరణ సమస్యగా మారిందని, ఇది జాతీయ విధానాలకు విఘాతంగా ఏర్పడిందన్నారు. మరోవైపు ఒక దేశం- రెండు వ్యవస్థల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తైవాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com