నీట మునిగి ఇద్దరు వలసదారుల మృతి, మరొకరి ఆచూకీ గల్లంతు
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. అల్ బెడా తీరంలో అల్ మసిలా కోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 9 మంది వలసదారుల్ని సహాయక సిబ్బంది రక్షించగా, అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి వుంది. బలమైన కెరటాల కారణంగా పది మంది ప్రమాదంలో వున్నట్లుగా ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందింది. కోస్ట్ గార్డ్ పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని 9 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు చనిపోయారు. ఏడుగురి పరిస్థితి బాగానే వుంది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







