300 బహ్రైనియులకు అరుదైన వ్యాధుల నిర్ధారణ

- March 18, 2016 , by Maagulf
300 బహ్రైనియులకు అరుదైన వ్యాధుల నిర్ధారణ

300 బహ్రైనియులకు అరుదైన వ్యాధుల నిర్ధారణ కాబడినట్లు ఆరోగ్య మంత్రి గురువారం  తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ మంది అరుదుగా ఉండే వ్యాధుల బాధపడుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ   తెలిపింది. అదే విధంగా  ప్రపంచంలో ప్రతి 2,000 మందిలో  ఒక వ్యక్తి ఈ అరుదైన వ్యాధి బారిన పడుతున్నట్లు  నిర్ధారణ కాబడింది. ఇప్పటి  వరకు ప్రపంచంలో  దాదాపు  5,000  అరుదైన వ్యాధులు ఉన్నాయని ఆరోగ్య మంత్రి  ఫఅఎక  అల్ సాలెహ్ 9 వ అంతర్జాతీయ వ్యాధి నిర్ధారణ దినోత్సవంలో పాల్గొని ఈ విషయాలను తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉన్నత ఆరోగ్య అధికారులు, వైద్యులు మరియు రోగులు మరియు వారి కుటుంబసభ్య్యులు హాజరయ్యారు.అత్యంత అరుదుగా ఉండే ఈ  వ్యాధుల నిర్ధారణ  ఏడాది వయస్సు నుంచి  35 సంవత్సరాల మధ్య వయస్సుల మధ్య బహ్రైనియులలో  బహిర్గతమవుతుంది . ప్రస్తుతం అరుదుగా ఉండే వ్యాధులతో  బాధపడుతున్న 300 బహ్రైనియులలో  57 మందికి  మైటోకాన్డ్రియాల్ వ్యాధి ఉన్నట్లు  నిర్ధారణ జరిగింది  ఈ అరుదైన వ్యాధులు వచ్చిన పిల్లలలో  ఒక సంవత్సరం వయస్సు లోపే  వారు 35 శాతం మంది మరణిస్తున్నారు. అసలు ఈ అరుదైన వ్యాధులు 80 శాతం జన్యు సంబంధమైనవి. పిల్లలు జన్మించిన     వెంటనే ఇవి  బైట పడవు. కానీ  ఏ వయసులోనైనా ఆ అరుదుగా ఉండే వ్యాధుల తన ఉనికిని చాటుకోవచ్చు అని మంత్రిత్వ శాఖ వివరించింది. అంతర్జాతీయ అరుదైన వ్యాధి దినోత్సవం నిర్వహించడం ద్వారా అరుదైన వ్యాధులు గూర్చి మరింత అవగాహన పెంచడానికి తద్వారా  ప్రజల జీవితాల్లో దాని ప్రభావం గురించి గుర్తించ బడటానికి  ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com