సౌదీ అరేబియా కీలక ప్రకటన..
- October 10, 2021
రియాద్: గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
యాత్రికులు ఎవరైతే ఇప్పటికే ఈ మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనల కోసం రిజర్వేషన్ చేసుకుని పర్మిట్ పొందారో వారు యాత్రకు 48 గంటల ముందు రెండో డోసు తీసుకున్న అనుమతి ఇస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో వారి పర్మిట్ క్యాన్సిల్ అవుతుందన్నారు. అంటువ్యాధికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు పబ్లిక్ హెల్త్ అథారిటీ నిరంతర మూల్యాంకనానికి లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కనుక యాత్రికులు మసీదులకు వచ్చే సమయంలో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







