తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 10, 2021
దోహా: తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.భారత్ 75 వ వసంతాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 'అజాది కా అమ్రిత్ హోత్సవ్' లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ ను నిర్వహించారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని తెలిపిన వివరాల ప్రకారం
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతార్ భారత రాయబారి డా.దీపక్ మిత్తల్ సతీమణి అల్పన మిత్తల్,ఖతార్ లో భారత రాయబార కార్యాలయ అధికారి పద్మ కర్రి హాజరు కాగా
ఐసిసి అధ్యక్షులు పి.బాబు రాజన్, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు,
ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ రావు కోడూరి, ICBF అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, ICBF ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్ విశిష్ట అతిథులు గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారులకు అండగా సిరిసిల్ల నుండి ప్రఖ్యాత చేనేత కళాకారుడు విజయ్ కుమార్ ప్రత్యేకంగా తెప్పించిన అగ్గిపెట్టె లో ఇమిడే చీర, ఉంగరంలో పట్టే చీర ను తెలంగాణ చేనేత గొప్ప తనాన్ని ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్య్రమాల్లో భాగంగా విదేశాల్లో మొట్ట మొదటి సారి తెలంగాణ ఒగ్గు కథని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో A.R రహ్మాన్ తెలంగాణ జాగృతి కోసం ప్రత్యేకంగా స్వర పరిచిన బతుకమ్మ పాట ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
అన్ని వర్గాల నుండి 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో విదేశి గడ్డపై ఆడపడుచులు సిరిసిల్ల చీర లతో, ఆటపాటలతో హోరెత్తించారు అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)





తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







