టెంపర్ తమిళ రీమేక్ హీరో విశాల్ కృష్ణ..
- March 18, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్‌లోనే స్థిరపడిన విశాల్ కృష్ణ ఈ రీమేక్‌లో పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టులో శింబు నటిస్తాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ, చివరకు అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం విశాల్ హీరో అని తేలింది.ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అది పూర్తికాగానే టెంపర్ మొదలుపెడతాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్‌కు టెంపర్ సినిమా తెగ నచ్చేసిందని, అందులో ఎన్టీఆర్ చేసిన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు.తెలుగులో జూనియర్ సరసన నటించిన కాజల్ అగర్వాలే తమిళంలోనూ హీరోయిన్‌గా చేస్తుందట. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అనల్ అరసు మెగాఫోన్ పట్టుకుంటారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







