స్నేహితుల్ని ముంచేసిన బహ్రెయినీ రిటైరీ
- October 12, 2021
మనామా: బహ్రెయినీ రిటైరీ ఒకరు తన స్నేహితుల్ని నిండా ముంచేశాడు. 100,000 బహ్రెయినీ దినార్లను ఈ క్రమంలో అతన్ని నమ్మిన స్నేహితులు నష్టపోయారు. కేసు వివరాల్లోకి వెళితే, మనామాలోని ఓ రెస్టారెంటులో నిందితుడ్ని, అతని స్నేహితులు కలిసేవారు. ఈ క్రమంలో నిందితుడు కొన్ని బిజినెస్ ప్లాన్స్ అతని స్నేహితుల ముందుంచాడు. అతన్ని నమ్మి, నిందితులు అతనికి కొంత మొత్తం ఇచ్చారు. అనంతరం, వారు నష్టపోయారు. ఈ విషయమై విచారణ సందర్భంగా నిందితుడు, ఆ సొమ్ముని తన స్నేహితులు తనకు పెట్టుబడులుగా పెట్టమని స్వచ్ఛందంగానే ఇచ్చారనీ, వాటిని తాను పెట్టుబడులుగా పెట్టగా, నష్టం వచ్చిందని వివరించాడు. మొదట ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,000 బహ్రెయినీ దినార్లు తీసుకుని, 500 బహ్రెయినీ దినార్లను లాభం కింద నిందితుడు ఇచ్చినట్లు తేలింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







