కారులో కన్నాబిస్ ఆయిల్: బ్రిటిష్ ఫుట్‌బాల్ కోచ్‌కి పాతికేళ్ళ జైలు
- October 13, 2021దుబాయ్: బ్రిటిష్ ఫుట్ బాల్ కోచ్‌కి చెందిన కారులో కన్నాబిస్ ఆయిల్ బాటిల్స్ కనుగొన్న అధికారులు, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు బిల్లీ హూద్, ఆ లిక్విడ్ కన్నాబిస్ తనకు చెందినది కాదనీ, తన స్నేహితుడు కారులో వాటిని వదిలేశాడని నిరూపించడంలో విఫలమయ్యారు. బిల్లీ హూద్, యాంటీ డ్రగ్ మరియు నాన్ స్మోకింగ్ ఫిట్నెస్ ఫానటిక్ కావడం గమనార్హం. కాగా, హూద్ స్నేహితుడు వాట్సాప్ మెసేజ్ ద్వారా తాను కారులో కన్నాబిస్ ఆయిల్ మర్చిపోయిన విషయాన్ని పేర్కొన్నారు. అయితే, డ్రగ్స్ విషయమై ఇరువురి మధ్యా సంభాషణ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో హూద్ తీవ్రంగా కలత చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్వచ్ఛందంగా హూద్, యూరిన్ టెస్ట్ చేయించుకోగా.. అది నెగెటివ్ వచ్చింది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్