ఏపీ కరోనా అప్డేట్
- October 13, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కొత్తగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,88,39,595 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,58,582కు చేరుకోగా.. రికవరీ కేసులు 20,37,691కు పెరిగాయి.మరోవైపు కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 14,276 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,615 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 97, తూర్పు గోదావరిలో 88, గుంటూరులో 84 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







