బోల్తా పడిన పాఠశాల వ్యాన్ భారతీయ బాలుడు మృతి, ఏడుగురికి గాయాలు

- March 18, 2016 , by Maagulf
బోల్తా పడిన పాఠశాల వ్యాన్  భారతీయ బాలుడు మృతి, ఏడుగురికి  గాయాలు

దోహాలో మలుపు తిరుగుతూ బోల్తా పడిన ఓ  కిండర్ గార్డెన్ వ్యాన్ ప్రమాదంలో ముక్కుపచ్చలారని ఒక  భారతీయ బాలుడు అక్కడక్కడే మృతి చెందగా  మరో  7 గురు  చిన్నారులకు  తీవ్ర గాయాలయ్యాయి.  గురువారం మధ్యాహ్నం హిలాల్  ప్రాంతంలో సర్వోదయ కిండర్ గార్టెన్ కు చెందిన వ్యాన్ లో  మొత్తం 13 విద్యార్ధులు పాఠశాల నుంచి ఇళ్ళకు తిరిగి వెళుతుండగా హొమీఅర్ల్య్ మలుపు వద్ద  వ్యాన్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐడెన్ షాజీ వర్గిస్ ( 5 ) అనే  బాలుడు దుర్మరణం చెందాడు. అలాగే సుడాన్ దేశానికి చెందిన  ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. చనిపోయిన చిన్నారి తండ్రి షాజీ వర్గిస్ కతార్  విమానయాన సంస్థ ఉద్యోగి అతని భార్య రీనా మాథ్యూ రుమైలః ఆసుపత్రితో నర్సుగా పని చేస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా,అయిదేళ్ళ క్రితం దోహాలో ఐడెన్ షాజీ వర్గిస్ వీరికి జన్మించాడు. భారతదేశంలో  కేరళ రాష్ట్రం తిరువల్ల జిల్లా  కురిశుమ్మూట్టి హౌస్ ప్రాంతానికి చెందిన వీరికి లేక లేక జన్మించిన అతడొక్కడే కుమారుడు కావడంతో ఆ దంపతుల శోకాన్నిఎవరు అదుపు చేయలేకపోతున్నారు. కాగా,  ప్రమాదం జరిగిన వ్యాన్ లో ఒక సహాయక మహిళ కూడా ఉంది .వీరందరు  చిన్న గాయాలపాలతో మృత్యుపాశం నుంచి తప్పుకొన్నారు.   స్వల్ప గాయాలయిన వ్యాన్ డ్రైవర్ ను  ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై  పోలీసులు ప్రశ్నిస్తున్నారు 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com