పార్లమెంట్ ను రద్దు చేసిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా

- October 14, 2021 , by Maagulf
పార్లమెంట్ ను రద్దు చేసిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా

జపాన్: జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన “ఫుమియో కిషిడా”..ఆ దేశ పార్లమెంట్ లోని దిగువ సభను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో దిగువ సభ రద్దు అయినట్లు దిగువ సభ స్పీకర్‌ తడమొరి ఓషిమా ధృవీకరించారు. స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభకు హజరైన దిగువ సభ లోని 465 మంది సభ్యులు లేచి నిలబడి బల్లలు చరిచి తమ అంగీకారం తెలిపారు.  జపాన్ ప్రధాని తాజా నిర్ణయం పై ప్రపంచ దేశాలు నివ్వెర పోయాయి. అయితే జపాన్ ప్రధాని మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్లున్నట్లు ప్రకటించారు. కిషిడా తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com