కళాభవన్ మణిది అసహజ మరణం...
- March 18, 2016
మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై ఫోర్సెనిక్ పరీక్షల అనంతరం ఆయన శరీరంలో విషపూరితమైన పురుగు మందు, ఇథనాల్, మిథనాల్ అవశేషాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నటుడు, గాయకుడు అయిన మణి(45) మార్చి 6న చనిపోయిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా మణిని మార్చి 4న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మార్చి 6న చనిపోయారు. వైద్యులు ఆయన శరీరంలో రసాయనాలు ఉన్నట్లు చెప్పడంతో మణి మరణంపై అనుమానాలు రేకెత్తాయి. కొచ్చిలోని కాక్కనాడ్లో మణి శరీరంలో విషపూరిత పదార్థాలపై లాబరేటరీ పరీక్షలు చేశారు.పరీక్షలో ప్రమాదకరమైన క్లోర్‌పైరిఫోస్ ఉన్నట్లు కెమికల్ ఎగ్జామినర్ కె.మురళిధరన్ తెలిపారు. మణి మరణంపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలపడంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణిది ఆత్మహత్య కాదని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని మణి భార్య తెలిపారు. మణి రెండొందలకు పైగా మళయాళ, తమిళ సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







