మెగాస్టార్ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
- October 16, 2021
హైదరాబాద్: కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి చేసారు. ‘దసరా పర్వదినాన చిరంజీవి ని కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని .. చిరంజీవిని కలవడంతో నా చిన్ననాటి కల నేరవెరింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్‌తో ఓ మూవీ తీయబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి సినిమాలు చేయనున్నాడని వినికిడి. ఇక రామ్ చరణ్.. ‘ఆచార్య, ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లు పూర్తి కావడంతో శంకర్ మూవీని మొదలు పెట్టాడు. ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం ప్రశాంత్ నీల్-చెర్రిల చిత్రం పట్టాలెక్కునుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







