చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- October 17, 2021
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు.దుబాయ్, షార్జా ప్రయాణీకుల వద్ద 1.20 కోట్ల విలువ చేసే 2 కేజీల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి.. ఆ పేస్టు ను క్యాపసల్స్ లో నింపారు కేటుగాళ్లు. అయితే ప్రాణాలకు తెగించి క్యాపసల్స్ రూపంలో వున్న బంగారాన్ని మలద్వారంలో దాచారు కంత్రిగాళ్లు. అయితే చెన్నై విమానాశ్రయంలో విమానం దిగగానే దర్జాగా బయటకు చెక్కేసే ప్రయత్నం చేసారు ఐదుగురు ముఠా సభ్యులు. వారి నడవడికలో అనుమానం రావడంతో ఐదుగురుని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేసింది కస్టమ్స్ బృందం. దాంతో మలద్వారం లో దాచిన బంగారం గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు.ఆ బంగారం సీజ్ చేసి ఐదుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







