కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోకి అనుమతి

- October 17, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోకి అనుమతి

ఒమన్: అక్టోబర్ 15 తో వ్యాక్సినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో సుప్రీం కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ లు తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లోకి ఉద్యోగులను అనుమతి ఇస్తామని ప్రకటించారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజర్లు, పబ్లిక్ ప్లేస్ ల్లోకి వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ యాప్, తారాసుద్+ ద్వారా రుజువులు చూపిస్తేనే అనుమతిస్తారు. అయితే,కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవద్దని డాక్టర్లు ధ్రువీకరించిన వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com