యూఏఈ గోల్డెన్ వీసా కొరకు నేరుగా Gitex లో దరఖాస్తు చేసుకోవచ్చు!

- October 19, 2021 , by Maagulf
యూఏఈ గోల్డెన్ వీసా కొరకు నేరుగా Gitex లో దరఖాస్తు చేసుకోవచ్చు!

కేవలం 2 రోజులు మిగిలి ఉన్నాయి: యూఏఈ గోల్డెన్ వీసా కొరకు నేరుగా Gitex లో దరఖాస్తు చేసుకోవచ్చు!

దుబాయ్: అక్టోబర్ 17 నుండి 21 వరకు జరుగుతున్న GITEX టెక్నాలజీ వీక్ లో మైండ్-కంట్రోల్డ్ కార్లు, వాట్సాప్ పార్కింగ్, 5 జి సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లు, ఇతర టెక్ లాంచ్‌లతో పాటు మరో అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వారం రోజుల ఈవెంట్‌లో ప్రదర్శించబడుతున్న మార్గదర్శక మరియు భవిష్యత్ సాంకేతికత..యూఏఈ ను మరోసారి డిజిటల్ పరిణామంలో ముందు వరుసలో ఉంచుతోంది. అయితే, సందర్శకులకు ఓ శుభవార్త..,యూఏఈ అందిస్తున్న గోల్డెన్ వీసా కొరకు అప్లై చేసుకోదలచినవారు, మరో రెండు రోజుల్లో ముగించబోతున్న ఈవెంట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు!

దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో (షేక్ సయీద్ హాల్‌లో) ఎగ్జిబిట్ వద్ద GDRFA స్టాండ్‌ ను సందర్శించండి. గోల్డెన్ వీసా కు కావలసిన అన్ని నియమాలు, అప్లై చేసే విధానం, ప్రక్రియ గురించి మీకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) అధికారులు వివరంగా తెలియజేస్తారు. 5-10 సంవత్సరాల వ్యవధి గల ఈ గోల్డెన్ వీసా, గడువు ముగిసిన తర్వాత స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది అని దరఖాస్తుదారులు గమనించాలి.

ఇప్పటివరకు, అత్యుత్తమ విద్యార్థులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, ప్రతిభావంతులైన వ్యక్తులు, సైన్స్ & నాలెడ్జ్‌లో పరిశోధకులు, జర్నలిస్టులు, వైద్యులు, రచయితలు మరియు మంచి సామర్థ్యం ఉన్నవారు దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ప్రకటించిన విషయం తెలిసిందే. మరింత సమాచారాన్ని కొరకు 8005111 లో అమెర్ కాల్ సెంటర్‌కు కాల్ చేయగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com