గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 06, 2015
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 'భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శ్రీధర్ సీపాన క్లాప్‌ను ఇవ్వగా, నిర్మాత ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరిమాట్లాడుతూ.."ఆనంద్ ప్రసాద్ గారు నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. యజ్ఞం సినిమాతో గోపిచంద్ నాకు బ్రేక్ ఇచ్చాడు. గోపీచంద్‌తో మరోసారి పని చేయడం ఆనందంగా ఉంది. శ్రీధర్ సీపాన మంచి స్టొరీ ఇచ్చారు. కోన, గోపి గారితో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ "కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు తప్ప మిగతా వారందరూ లౌక్యం చిత్రానికి పనిచేసిన టీమ్‌తోనే మరోసారి పనిచేస్తున్నాను. యజ్ఞం వచ్చి పదేళ్లవుతుంది. ఆ సినిమా తర్వాత రవికుమార్ చౌదరిగారితో చేస్తున్న సినిమా ఇది. శ్రీధర్ సీపాన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. లౌక్యం కంటే మంచి కామెడీ, హీరోయిజమ్, ఎమోషన్స్ ఉన్న సినిమా. తప్పకుండా మంచి చిత్రమవుతుంది'' అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్, ఎడిటర్: గౌతంరాజు, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









