బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- October 21, 2021
రియాద్: సౌదీ ఆరోగ్య శాఖ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు హై రిస్క్ లో ఉన్న వారికే బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఐతే రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలల వ్యవధి ఉన్న వారు మాత్రమే బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. "Tawakkalna", "sehhati" యాప్ ల ద్వారా అపాయింట్ మెంట్ ను బుక్ చేసుకోవచ్చు. హై రిస్క్ కేటగిరీలో ఉన్న వారు మాత్రం తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కు రిస్క్ ఎక్కువగా ఉంది. దీంతో ముందుగా వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ ప్రభుత్వానికి సూచించారు. ఆ మేరకు సౌదీ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







