షారూఖ్ ఖాన్‌కు బిగ్ షాక్..ఎన్సీబీ అధికారుల సోదా
- October 21, 2021
డ్రగ్స్ కేసు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చుబిగుకుంటోంది. మూడు సార్లు అతడి బెయిల్ పిటిషన్ ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్‌కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
అదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నివాసానికి కూడా మరో ఎన్సీబీ టీమ్ వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల లోపు ఎన్సీబీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు జారీచేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







