విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం
- October 21, 2021
హైదరాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు.
ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







