ట్యాక్సులు తగ్గించండి.. మోదీని కోరిన టెస్లా

- October 21, 2021 , by Maagulf
ట్యాక్సులు తగ్గించండి.. మోదీని కోరిన టెస్లా

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ నెంబర్ వన్‌. అయితే ఆ కంపెనీ ఇండియాలో తన వాహనాలను అమ్మాలనుకుంటున్నది. మన దేశంలో ఇంపోర్టెడ్ కార్లు అమ్మాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాల్సిందే. అయితే ఆ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నట్లు టెస్లా కంపెనీ ఆరోపిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతూ..ప్రధానమంత్రి కార్యాలయానికి టెస్లా కంపెనీ ప్రతినిధులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంపోర్ట్ ట్యాక్సులు ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సుంకాన్ని తగ్గిస్తే, అప్పుడు దేశీయ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు తగ్గుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఇండియా ఎగ్జిక్యూటివ్ మనుజ్ ఖురానా..

ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గింపు అంశంపై.. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్న పన్ను విధానం తమ కంపెనీకి అనుకూలంగా లేదని టెస్లా అధికారులు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 60 శాతం దిగుమతి సుంకాన్ని ఇండియా వసూల్ చేస్తున్నది. పన్నులు ఎక్కువ స్థాయిలో కట్టడం వల్ల.. వాహనాల ఖరీదు మరింత ప్రియం అవుతుందని టెస్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com