డ్రైవర్లకు ఎక్స్‌పో పాస్ పోర్టులు, బహుమతులు అందించి అభినందించిన అబుదాబి పోలీస్

- October 21, 2021 , by Maagulf
డ్రైవర్లకు ఎక్స్‌పో పాస్ పోర్టులు, బహుమతులు అందించి అభినందించిన అబుదాబి పోలీస్

అబుదాబి: ట్రాఫిక్ నిబంధనల్ని చక్కగా పాటిస్తూ, వాహనాల్ని భద్రంగా నడుపుతున్న వాహనదారుల్ని అబుదాబి పోలీసులు ఎక్స్‌పో పాస్ పోర్టులతో అలాగే బహుమతులతో సత్కరిస్తున్నారు. అబుదాబి పోలీస్ హ్యాపీనెస్ పెట్రోల్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పోలీసుల నుంచి బహుమతులు అందుకుంటున్న వాహన దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతోందనీ, అలాగే ట్రాఫిక్ నిబంధనల పట్ల మరింత బాధ్యత పెరుగుతోందనీ వాహనదారులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com