రోడ్డుపై వెహికల్ తో వీరంగం సృష్టించిన డ్రైవర్ అరెస్ట్
- October 24, 2021
కువైట్: సాల్మియాలో వాహనంతో రోడ్డుపై వీరంగం సృష్టించిన ఓ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వాహనాన్ని సీజ్ చేశారు. సాల్మియా లో శనివారం అత్యంత ప్రమాదకరంగా అతను వెహికల్ ను నడిపాడు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇతర వాహనాదారులను ఇబ్బంది పెట్టాడు. అతని డ్రైవింగ్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఆ డ్రైవర్ ను పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







