ఒమన్ ఖర్జూర పండ్ల అమ్మకాలకు ప్రత్యేక స్టోర్లు
- October 24, 2021
ఒమన్: ఒమన్ ఖర్జూర పండ్లకు ఉన్న ప్రత్యేకత తెలిసిందే. అత్యంత క్వాలిటీగా ఉండే ఈ పండ్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒమని డేట్స్ పేరుతో ఒమన్ అవెన్యూ మాల్ లో స్పెషల్ అవుట్ లెట్స్ ను స్టార్ట్ చేశారు. అదే విధంగా ఖర్జూర రైతులు, మార్కెటింగ్ చేసే వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి సల్తానటే లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లోనూ ప్రత్యేక స్టాల్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో డేట్స్ నట్స్, ఖర్జురా జ్యూస్, వెనిగర్ ప్రాడెక్ట్ లను ప్రదర్శనకు పెట్టారు. అక్టోబర్ 31 వరకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఒమని డేట్స్ పండించే రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని నెలలుగా కృషి చేస్తున్నారు. ఒమని డేట్స్ ప్రత్యేకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







