స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచటం పై ప్రభుత్వం ఫోకస్
- October 24, 2021
బహ్రెయిన్: స్కూల్ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధమైంది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నుయిమి చెప్పారు. లైఫ్ క్వాలిటీ, భాషా నైపుణ్యాలు మెరుగుదల, డిజిటల్ ఎంపవర్ మెంట్ స్పెషలిస్ట్స్, సోషల్, హెల్త్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సెలర్లు లాంటి కొత్త ఉద్యోగాలను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వీటితో స్కూల్ ఎడ్యుకేషన్ నాణ్యత మెరుగవుతుందని, అలాగే స్కూల్ అనుబంధ వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయన్నారు. మొదటగా షైఖా మోజా బింట్ హమద్ అల్ ఖలీఫా సమగ్ర బాలికల పాఠశాల, రిఫా ఇంటర్మీడియట్ బాలుర పాఠశాల, అల్-ముస్తక్బాల్ ప్రాథమిక బాలికల పాఠశాల, ఉక్బా బిన్ నఫియా ప్రాథమిక బాలుర పాఠశాల.. ఈ నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







