దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న రజినీకాంత్

- October 25, 2021 , by Maagulf
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న రజినీకాంత్

న్యూ ఢిల్లీ: సినీ వినీలాకాశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతుంది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో నిర్వహిస్తోంది కేంద్రం. ఈ కార్యక్రమానికి భారతీయ సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు.. ఉత్తమ చిత్రాలగు అవార్డులు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువరు అవార్డులు అందుకున్నారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు . గత నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో రజినీ నిజంగానే సూపర్ స్టార్. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా.. రజినీ తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా మలయాళం నుంచి మరక్కర్ సినిమా నిలవగా.. భోంస్లే చిత్రానికి మనోజ్ పాయ్.. అసురన్ చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు.. ఇదిలా ఉంటే.. ఒకే సంవత్సరం రజినీకాంత్.. ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడానికి రజినీ ఆయన సతిమణి.. కూతురు ఐశ్వర్య.. అల్లుడు ధనుష్ హజరయ్యారు. తెలుగులో జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు. ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ. ఉత్తమ పాపులర్ చిత్రంగా మహర్షి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com