ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం: చంద్రబాబు
- October 25, 2021
అమరావతి: దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా లింక్ ఏపీలో ఉంటుందని... రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా తయారైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో పరిస్థితులపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంప్లైంట్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరిన ఆయన... 8 పేజీల లేఖను అందించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నంబర్ వన్‌గా ఉండేదని... ఇప్పుడు డ్రగ్స్‌లో నెంబర్ వన్‌గా ఉందన్నారు. టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతుందంటూ నిప్పులు చెరిగారు.
రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ.... బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి... ప్రజా ప్రతినిధుల్ని కస్టడీలో కొడుతున్నారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్