సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ రాకుమారి.!
- October 26, 2021
జపాన్: జపాన్ రాకుమారి మాకో ఎట్టకేలకు తన ప్రియుడు కొమరోను పెళ్లాడింది. ప్రేమ కోసం రాచరికపు హోదను వదలి పెట్టుకుంది. మకో, కొమురో వివాహ పత్రాన్ని పాలెస్ అధికారులు సమర్పించినట్లు ఇంపీరియల్ హౌజ్ హోల్డ్ ఏజెన్సీ తెలిపింది. పెళ్లికి సంబంధించి ఎలాంటి విందులు, ఆచారాలు ఉండవని పేర్కొంది. మాకో ప్రస్తుత జపాన్ చక్రవర్తి నరుహిటో బ్రదర్ ప్రిన్స్ అఖిషినో కూతురు. ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో మాకో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత లండన్‌లో యూనివర్సిటీ ఆఫ్ లీసిస్టర్స్ నుంచి మ్యూజియాలజీలో మాస్టర్స్ పట్టా పొందారు. డిగ్రీ కాలేజీ డేస్‌లో మాకోకు కొమురోతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
2017లోనే కొమురోను పెళ్లి చేసుకుంటానని మాకో ప్రకటించింది. అదే సంవత్సరం మాకో, కొమురోకు నిశ్చితార్థం జరిగిందని ఇంపీరియల్ హౌజ్ హెల్డ్ ఏజెన్సీ తెలిపింది. వీరి పెళ్లి ఎప్పుడో జరగ్సాలి ఉండగా .. కొమరో తల్లి వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు మూడేళ్లీ నీరక్షణ తర్వాత మాకో, కొమరోలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. జపాన్ రాకుమారిలు సామాన్య కుటుంబాలకు చెందిన యువకులను పెళ్లాడితే రాచరికపు హోదాను వదులుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాజ కుటుంబం నుండి వచ్చే రూ.10 కోట్ల విలువైన బహుమతిని మాకో తిరస్కరించింది. పెళ్లి జరిగిన మాకో, కొమరోలు రాజప్రసాదాన్ని వీడారు. ఈ సమయంలో తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని మాకో ఒకింత భావోద్వేగానికి గురయ్యింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!