13 ఎయిర్‌పోర్టులను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం
- October 26, 2021
న్యూ ఢిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్), జబల్ పూర్(మధ్యప్రదేశ్), కంగ్రా (పంజాబ్), గయ (యూపీ), ఖుషీ నగర్ (యూపీ), జర్సుగూడ (ఒడిశా) ఉన్నాయి.పెద్ద విమానాశ్రయాలను చిన్న ఎయిర్‌పోర్టులతో కలిపి వేలం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!