వారం రోజుల్లోనే 662 మందిపై బహిష్కరణ వేటు

- October 27, 2021 , by Maagulf
వారం రోజుల్లోనే 662 మందిపై బహిష్కరణ వేటు

కువైట్: వారం రోజుల్లోనే 662 మంది ప్రవాసులను కువైట్ గవర్నమెంట్ బహిష్కరించింది. ఈ నెల 17 నుంచి 25 మధ్య చట్టాన్ని ఉల్లంఘించిన 662 మందిని బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 447 మంది పురుషులు, 215 మంది మహిళలు ఉన్నారు. దేశ అంతర్గత వ్యవహాల మినిస్టర్ షేక్ థామర్ అలీ సబా అల్-సలేం అల్-సబా, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, లెఫ్టినెంట్-జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆదేశాలతో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com