3-11 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం
- October 27, 2021
బహ్రెయిన్: 3-11 ఏళ్ల వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సినోఫార్మ్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. దీంతో 3 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సినోఫార్మ్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. వ్యాక్సిన్ కమిటీ నిర్వహించిన మెడికల్ హెల్త్ అండ్ భద్రతా సిఫార్సులను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు Pfizer-BioNTech వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లేదా BeAware యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరెంట్స్/గార్డియన్ అనుమతి తప్పనిసరి అని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. పిల్లలు టీకాలు తీసుకునేటప్పుడు వారితో పాటు పెద్దలు కూడా ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్







