3-11 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం

- October 27, 2021 , by Maagulf
3-11 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం

బహ్రెయిన్: 3-11 ఏళ్ల వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సినోఫార్మ్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. దీంతో 3 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సినోఫార్మ్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. వ్యాక్సిన్ కమిటీ నిర్వహించిన మెడికల్ హెల్త్ అండ్ భద్రతా సిఫార్సులను క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు Pfizer-BioNTech వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లేదా BeAware యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి పేరెంట్స్/గార్డియన్ అనుమతి తప్పనిసరి అని టాస్క్ ఫోర్స్ పేర్కొంది. పిల్లలు టీకాలు తీసుకునేటప్పుడు వారితో పాటు పెద్దలు కూడా ఉండాలని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com