వలసదారుల రెసిడెంట్ కార్డు మూడేళ్ళ చెల్లుబాటు
- October 27, 2021
మస్కట్: సివిల్ స్టేటస్ చట్టానికి సంబంధించి కొన్ని నిబంధనల్లో సవరణ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు కస్టమ్స్ లెఫ్టినెంట్ జనరల్ హాసన్ బిన్ మొహసెన్ అల్ ష్రాయికి డెసిషన్ జారీ చేశారు. 30 రోజుల్లో ఐడెంటిటీ మరియు రెసిడెన్సీ కార్డుని జారీ చేయడం (10ఏళ్ళ వయసు చేరుకున్న వ్యక్తికి.. ఒమనీయులు అలాగే రెసిడెంట్స్కి) ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం. సుల్తానేట్ బయట నుంచి వచ్చే రెసిడెంట్ (10ఏళ్ళ పైబడిన వయసు) 30 రోజుల్లో కార్డు పొందవచ్చు. రెసిడెంట్స్ అలాగే పౌరులకు (10ఏళ్ళ లోపువారికి) ఇది వర్తిస్తుంది. గెజిట్లో ప్రచురితమైనప్పటినుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. సివిల్ ఐడీ పొందడానికి ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, ఒరిజినల్ ఐడీ (తల్లిదండ్రులది), సంబంధిత అథారిటీస్ నుంచి లేఖ (జాతీయతకు సంబంధించి) తప్పనిసరి. రేషన్ కార్డ్ కోసం ఒరిజినల్ పాస్పోర్టు, సంబంధిత అథారిటీ నుంచి నోటిఫికేషన్ తప్పనిసరి. సివిల్ ైడీ ఐదేళ్ళకు చెల్లుబాటవుతుంది. రెసిడెంట్ కార్డు మూడేళ్ళకు వర్తిస్తుంది. కొత్త సివిల్ కార్డు కోసం 5 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. రెన్యువల్ కోసం 5 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సిందే. పాడైపోయిన సివిల్ కార్డు తిరిగి పొందాలంటే 10 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. కొత్త రెసిడెంట్ కార్డు కోసం ప్రతి ఏడాదీ 5 ొమన్ రియాల్స్ చెల్లించాలి. రెసిడెంట్ కార్డు రెన్యువల్ కోసం ఏడాదికి 5 ఒమన్ రియాల్స్. డ్యామేజ్ అయిన కార్డును పొందాలంటే 20 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. సివిల్ ఐడీ కార్డు లేదా రెసిడెంట్ కార్డు పొందలేకపోతే ప్రతి నెలా 5 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల