ఖేల్‌రత్న లిస్ట్ వచ్చేసింది..
- October 27, 2021
న్యూ ఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల కమిటీ మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుల కోసం 11 మంది అథ్లెట్లను సిఫార్సు చేసింది. ఇది మనదేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం. టోక్యో ఒలంపిక్స్ స్వర్ణం అందుకున్న నీరజ్ చోప్రాతో పాటు.. మెడల్స్ సాధించిన రవి దహియా, పీఆర్ శ్రీజేష్, లోవ్లీనా బోర్గోహైలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ప్రముఖ ఫుట్ బాలర్ సునీల్ ఛెత్రి, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
క్రీడల్లో 2021 సంవత్సరం మరపురానిదిగా నిలిచిపోనుంది. ఎందుకంటే.. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్‌లో కూడా మనదేశానికి ఎన్నో పతకాలు వచ్చాయి. పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన మొదటి భారతీయ మహిళగా అథ్లెట్ అవని లెఖారా నిలిచింది. తనను కూడా ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. పారాలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన సుమిత్ అంటిల్‌కు కూడా ఈ అవార్డు దక్కింది. దీంతోపాటు మరో 35 మందిని అర్జున అవార్డుకు రికమెండ్ చేశారు.
ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసిన 11 మంది భారతీయ అథ్లెట్లు వీరే:
1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)
2. రవి దహియా (రెజ్లింగ్)
3. పీఆర్ శ్రీజేష్ (హాకీ)
4. లోవ్లీనా బోర్గోహై (బాక్సింగ్)
5. సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
6. మిథాలీ రాజ్ (క్రికెట్)
7. ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
8. సుమిత్ అంటిల్ (జావెలిన్)
9. అవని లెఖారా (షూటింగ్)
10. కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్)
11. ఎం నర్వాల్ (షూటింగ్)
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం తీసుకురాగా.. మహిళల హాకీ జట్టు కూడా సెమీస్ చేరుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి