ఈ 21న జాకీచాన్ ఇండియా రానున్నాడు : సోనూ సూద్
- March 19, 2016
మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం 'కుంగ్‌ఫూ యోగా'. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తారలు 'లోఫర్' ఫేమ్ దిశా పాట్నీ, 'అనేకుడు' ఫేమ్ అమైరా దస్తర్ కథానాయికలు కాగా, విలన్ గా సోనూ సూద్ చేస్తున్నాడు. 'కుంగ్ ఫూ యోగా' మూవీ షూటింగ్ లో భాగంగా జాకీచాన్ సోమవారం (మార్చి 21న) భారత్ కు రానున్నాడు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డులు 2016లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ... జాకీచాన్ తో కలిసి తాను నటిస్తున్నానని, ఆ మూవీ కోసం ఆయన భారత్ కు రానున్నారని తెలిపాడు.గతంలో 'ద మిత్' మూవీలో బాలీవుడ్ ఐటమ్ బాంబు మల్లికా షెరావత్, జాకీచాన్ తో కలిసి నటించింది. 2013లోనూ మూవీ షూటింగ్ కోసం జాకీచాన్ భారత్ కు వచ్చాడు.చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత్ తో మూడు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో కుంగ్ ఫూ యోగా ఒకటి. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ 21న జాకీచాన్ ఇందు కోసం ఇండియా రానున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను మూడు వారాల పాటు చిత్రీకరిస్తారని సోనూ సూద్ వివరించాడు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







