బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా క్యాంప్ నిర్వహించిన ఐసిఆర్ఎఫ్
- October 28, 2021
మనామా: ఏడాదిపాటు నిర్వహించే మెగా మెడికల్ క్యాంపులో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా క్యాంపుని షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్, మనామాలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 90 మంది మహిళలు వైద్య పరీక్షలు మరియు డాక్టర్ కన్సల్టేషన్ కోసం హాజరయ్యారు. ఎంబసీ ఆఫ్ ఇండియా సెకెండ్ సెక్రెటరీ రవిశంకర్ శుక్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ బృందాలు, ఐసిఆర్ఎఫ్ వాలంటీర్లు అలాగే పార్టిసిపెంట్లతో ఆయన మాట్లాడారు. అనుమానాస్పదమైన కణితులు కనిపించినా, వాటిని మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారని డాక్టర్ షైని సుసీలన్ చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ సకాలంలో గుర్తించగలిగితే నయం చేయవచ్చు. కాగా, ఏడాది పాటు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం ద్వారా 5000 మందికి పైగా కార్మికులకు వైద్య సహాయం చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. జనరల్ కన్వీనర్ నాజెర్ మజెరి (32228424), జనరల్ కోఆర్డినేటర్ మురళీ క్రిష్ణన్ (34117864) నెంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..