ఆర్యన్ ఖాన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
- October 28, 2021
ముంబై: ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతనికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరైంది. ఆర్యన్ బెయిల్ పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆర్యన్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చివరకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన 23 రోజుల తర్వాత ఆర్యన్ కు బెయిల్ లభించనట్టయింది. ఇంతకుముందు రెండుసార్లు అతని బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ముంబైలోని ఆర్ధర్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్... రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..