ఏపీ కరోనా అప్డేట్
- October 28, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగానే వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,896 శాంపిల్స్ పరీక్షించగా.. 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందారు.. ఇదే సమయంలో 414 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,94,04,281 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు పెరిగింది.ఇక, రికవరీ కేసులు 20,46,127 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 14,365 కు చేరిందని.. ప్రస్తుతం 4,743 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్