కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు
- October 29, 2021బెంగుళూరు: శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. పునీత్ కుటుంబ సభ్యులను కర్ణాటక సీఎం పరామర్శించారు.
అతి చిన్న వయసులో గుండెపోటు బారిన పడిన నటుడు పునీత్ రాజ్ కుమార్ కావడం గమనార్హం. ఎప్పుడూ ఫిట్ గా ఉండే ఆయన హఠాత్తుగా గుండెపోటు బారిన పడడం అభిమానులతో పాటు సెలెబ్రిటీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రీసెంట్ గా “బజరంగీ 2” సినిమా వేడుకకు పునీత్ రాజ్ కుమార్ హాజరయ్యారు. అన్న శివరాజ్ కుమార్‌తో సహా సినీ ప్రముఖులతో ఆయన గడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్