GMR వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

- October 29, 2021 , by Maagulf
GMR వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాంలో GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ GMR వరలక్ష్మి కేర్ హాస్పిటల్‌లో ఈ రోజు 1,000 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్‌ ప్రారంభమైంది. శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ శ్రికేష్ బి. లాఠకర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ప్లాంట్‌ను ప్రారంభించారు.

కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో, ఈ 200 పడకల ఆసుపత్రి అంకితభావంతో ప్రజలకు సేవ చేసింది. ఆ సమయంలో సుమారు 500 మంది వ్యక్తులు ఇక్కడ చికిత్స పొందినా ఒక్క బ్లాక్ ఫంగస్ కేసూ లేదు. 

GMR వరలక్ష్మి కేర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర దామెర, “థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో, ఆసుపత్రి విస్తృతమైన సేవల కోసం సన్నద్ధమైంది. దీనిలో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లే కాకుండా లిక్విడ్ ఆక్సిజన్‌ను, 50 ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లను సిద్ధం చేసాం. కోవిడ్‌తో పోరాటంలో ఈ కొత్త 1,000 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ మేం సమకూర్చుకున్న మరో ఆయుధం. ఈ ప్లాంట్ నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెకెండ్ వేవ్ సమయంలో ఆటంకంగా మారిన సిలిండర్లను నింపాల్సిన అవసరాన్ని ఇది తొలగిస్తుంది,” అన్నారు.

జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్‌ను కేర్ ఆసుపత్రి సహాయంతో 2011లో నిర్మించారు. ఈ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. 

NABH గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రి - జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, నియోనాటాలజీ & పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, డెంటల్, ఈఎన్‌టీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ మరియు ఆప్తాల్మాలజీలో సేవలను అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో స్త్రీ పురుష జనరల్ వార్డులతో పాటు సర్జికల్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, పీడియాట్రిక్ వార్డ్ మరియు లేబర్ రూమ్‌ సేవలు అతి తక్కువ ఖర్చుతో లభిస్తాయి. OPD బ్లాక్‌లోని హాస్పిటల్ యొక్క కేంద్రీకృత ఎయిర్ కండిషన్డ్ ఔట్ పేషెంట్ కన్సల్టేషన్ గదులలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇక్కడ వారానికోమారు ప్లాన్డ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్‌లనూ నిర్వహిస్తారు.

ప్రారంభమైనప్పటి నుండి, 7 లక్షల మందికి పైగా ఇక్కడ అవుట్-పేషెంట్ సేవలను, 55,000 మంది రోగులు ఇన్-పేషెంట్ సేవలను పొందారు. అన్ని సదుపాయాలూ కలిగిన మూడు ఆపరేషన్ థియేటర్లతో ఉన్న ఈ ఆసుపత్రిలో విజయవంతంగా 30,000 శస్త్రచికిత్సలు జరగ్గా, వీటిలో 2,000 లాపరోస్కోపిక్ చికిత్సలున్నాయి.

ఇవే కాకుండా, ఇక్కడ 5,000 ట్రామా కేసులను విజయవంతంగా నిర్వహించి, 8 లక్షలకు పైగా ప్రిస్క్రిప్షన్‌ల ద్వారా ఔషధాలను అందించారు. రేడియాలజీ విభాగంలో 3 లక్షల మంది రోగులను, ల్యాబొరేటరీ సేవలలో 4.5 లక్షల మంది రోగులను పరీక్షించారు.

ఇక్కడ అనేక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలే కాకుండా గ్రామీణ మహిళలకు లేబర్ సర్వీసులను కూడా అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముందు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం-ఆరోగ్యశ్రీకి ఈ ఆసుపత్రి అనుబంధంగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయాక ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకంగా మారింది. దీనిని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు.

ఈ ఆసుపత్రి గ్రామీణ ప్రాంతంలో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న ఈ ఆసుపత్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకే కాకుండా దక్షిణ ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు అందిస్తోంది.

కోవిడ్ మహమ్మారి సమయంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు అనుబంధంగా ఉన్న ఈ ఆసుపత్రి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించింది. ఇక్కడ కోవిడ్ పాజిటివ్ రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స కూడా అందించారు. ఈ ఆసుపత్రిని రాజాం పట్టణం మరియు సమీప ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com