ఏపీలో గంజాయి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందన

- October 29, 2021 , by Maagulf
ఏపీలో గంజాయి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందన

అమరావతి: ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఇదే అంశంపై మరోసారి స్పందించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా ఇది నడుస్తోందని వెల్లడించారు. 2018 నుంచి తాను ఈ అంశాన్ని ఎత్తిచూపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైస్సార్సీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింతగా విస్తరించిందని పవన్ ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com